: హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ సరసన దీపికా పదుకొణె!
బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ దీపికా పదుకొణె మరో ప్రముఖ హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'పింక్ విల్లా.కామ్' ఒక కథనాన్ని రాసింది. బ్రాడ్ పిట్ తో నటించనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సైన్ కూడా చేసిందని సమాచారం. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులను ఎన్నో తన ఖాతాలో వేసుకున్న దీపిక బ్రాడ్ పిట్ సరసన నటిస్తుందన్న వార్తలు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, దీపికా పదుకొణె నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం ‘ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’. ఇందులో విన్ డీసెల్ సరసన దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే.