: టీఆర్ఎస్ లో వరుస చేరికలపై వినయ్ భాస్కర్ అసంతృప్తి!


టీఆర్ ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలపై వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలోకి వస్తున్న నేతల కారణంగా అంతకుముందు నుంచి ఉన్న పార్టీ నేతలకు ప్రాధాన్యం తగ్గుతుందనేది ఆయన వాదనగా తెలుస్తోంది. వరంగల్ కార్పొరేషన్ టిక్కెట్ల విషయంలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కాగా, వరంగల్ జిల్లా నుంచి టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News