: డ్యూటీలో లేకపోయినా పర్లేదు, తుపాకులు తీసుకెళ్లండి: ఇజ్రాయిల్ సైనికులకు ఆఫర్
ఇజ్రాయిల్ సైనికాధికారులు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యే ఇజ్రాయెల్ కు చెందిన సైనికుడు సెలవులకు ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా పాలస్తీనాకు చెందిన ఆందోళనకారులు ఆయనను కొట్టి చంపేశారు. దీంతో అతని భార్య మాట్లాడుతూ, ఆ సమయంలో తన భర్త వద్ద తుపాకీ ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని, కనీసం ఆయనను ఆయన రక్షించుకునేవారని పేర్కొంది. దీంతో ఆలోచనలో పడ్డ ఆర్మీ ఉన్నతాధికారులు, ఇకపై సైనికులు సెలవుల్లో ఇళ్లకు వెళ్లేటప్పుడు తుపాకులు తీసుకొనే వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.