: గెలుపు గుర్రాలను ఊహించడం కష్టం: కోహ్లీ
పాకిస్థాన్ తో ఆడడం ఎప్పుడూ ఆనందమేనని కోహ్లీ అన్నాడు. పాకిస్థాన్ జట్టు ఆసియాకప్ లో ఆడడం శుభపరిణామమని అన్నాడు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. అయితే ఆసియా కప్ లో ఫేవరేట్లుగా బరిలో దిగుతున్నప్పటికీ టోర్నీలో గెలుపుగుర్రాలను ఊహించడం అంత సులభం కాదని కోహ్లీ చెప్పాడు. ప్రతిభావంతమైన జట్లతో ఆడుతున్న సంగతి టీమిండియా ఆటగాళ్లకు తెలుసని అన్నాడు. టీట్వంటీల్లో ఆడడంలో భారతీయ క్రికెటర్లు నిష్ణాతులని కోహ్లీ తెలిపాడు. శక్తిమేరకు ఆడితే ప్రపంచంలోని ఏ జట్టునైనా చిత్తు చేయగల సామర్థ్యం తమ ఆటగాళ్లకు ఉందని కోహ్లీ స్పష్టం చేశాడు.