: ఉన్మాది దాడిలో ముగ్గురికి గాయాలు


పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఉన్మాది దాడికి పాల్పడిన సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామంలో ఉన్మాది ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. గాయాలపాలైన ముగ్గురిని సమీప ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఉన్మాదిని గ్రామస్తులు బంధించారు. కాగా, ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News