: అద్దె ఇంటిని ఖాళీ చేయనున్న చంద్రబాబు!
నెలలో అత్యధిక సమయం విజయవాడలోనే గడుపుతున్న చంద్రబాబునాయుడు, హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని అద్దె ఇంటిని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. తన సొంతింటిని పునర్నిర్మిస్తున్న చంద్రబాబునాయుడు, ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని ఓ అద్దె ఇంట్లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. దాన్ని ఖాళీ చేసి హఫీజ్ పేటలో ఉన్న ఫాంహౌస్ కు మారేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయన ఫాంహౌస్ లోనే ఉంటారని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం విజయవాడకు వెళ్లినప్పుడల్లా మంగళగిరి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న భవంతిలో ఆయన ఉంటున్నారన్న సంగతి తెలిసిందే.