: పవన్ కల్యాణ్ పై అభిమానం వెడ్డింగ్ కార్డుకెక్కింది!


సినిమా నటుల పట్ల అభిమానులు చూపించే అభిమానం రకరకాలుగా వుంటుంది. ఇంట్లో తమ హీరో ఫొటోలు పెట్టుకుని పూజించే వారూ ఉన్నారు. కానీ, ఈ అభిమానం మరింత ముందుకెళ్లి ఏకంగా తన పెళ్లి శుభలేఖలో తన అభిమాన నటుడి ఫొటోని ముద్రించేలా చేసింది. ఏపీ రాజధాని అమరావతికి చెందిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని ఒకరు, ఈ నెల 24వ తేదీన జరగనున్న తన పెళ్లి శుభలేఖలో పవన్ కల్యాణ్ ఫొటోతో పాటు జనసేన పార్టీ పేరు, లోగో ను సైతం ముద్రించాడు. ఇంకో ట్విస్ట్ ఏమిటంటే, పవన్ కల్యాణ్ అభిమానులందరూ తన పెళ్లికి వచ్చి తమ జంటను దీవించాలని ఆ శుభలేఖలో కోరాడు. ఈ శుభలేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News