: సంజయ్ దత్ విడుదల రోజున ఆ హోటల్ లో ప్రత్యేక వంటకం!


1993 నాటి ముంబయి పేలుళ్లకు సంబంధించి అక్రమ ఆయుధాలను నిల్వ చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెల 25న విడుదల కానున్నాడు. ఈ సందర్భంగా ముంబైలోని ఆయన అభిమాని, ఒక హోటల్ యజమాని అయిన ఖలీద్ తన హోటల్ లో బంపర్ ఆఫర్ ప్రకటించారు. సంజయ్ దత్ విడుదల రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు తన హోటల్ కు వచ్చే వారికి ప్రత్యేక వంటకం ‘చికెన్ సంజూ బాబా’ను ఉచితంగా వడ్డించనున్నామన్నారు. ఈ వంటకం ప్రత్యేకత గురించి ఆయన మాట్లాడుతూ, ముప్ఫై ఏళ్ల క్రితం సంజయ్ దత్ తమ హోటల్ లో ఫ్యామిలీ సెక్షన్ ను ప్రారంభించారని, ఈ సందర్భంగా ఆయన ‘చికెన్ సంజూ బాబా’ వంటకాన్ని స్వయంగా తయారు చేసి తమకు కానుకగా ఇచ్చారని ఆయన చెప్పారు. కాగా, పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్, వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ వరకు శిక్ష అనుభవించాల్సి ఉంది. కానీ, ఆయన సత్ప్రవర్తన కారణంగా కొన్ని నెలల ముందుగానే... ఈ నెల 25న విడుదల కానున్నారు.

  • Loading...

More Telugu News