: తూచ్... డబ్బుల మూట వట్టిదే!
గంటల వ్యవధిలో మాట మారిపోయింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డులో అసలు డబ్బులేవీ దొరకనే లేదట. అంతా వదంతులేనట. డంపింగ్ యార్డులో ఎలాంటి డబ్బులున్న మూటా దొరకలేదని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నవీన్ అంటున్నారు. నేడు సెక్యూరిటీ విధులు నిర్వహించిన అందరినీ విచారించామని, తమకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని తెలిపారు. ఈ మొత్తం విషయంలో ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డబ్బే దొరకకుంటే, పోలీసులకు డబ్బు కట్టలపై సమాచారం ఇచ్చిందెవరు? పోలీసు వర్గాల నుంచే తొలుత మీడియాకు ఎలా సమాచారం వచ్చింది? పోలీసులు విచారిస్తున్నారని తొలుత వచ్చిన వార్తలు అబద్ధాలా? లేక డబ్బు పంపకాల్లో రాజీ కుదిరిందా? వీటన్నింటికీ సమాధానం తెలియాల్సివుంది.