: హైదరాబాదులో ఏపీ సీఐడీ అధికారుల సోదాలు


ఏపీ హౌసింగ్ బోర్డు నిధుల గోల్ మాల్ పై ఏపీ సీఐడీ విచారణ చేపట్టింది. 3 నెలల కిందట నిధులు గోల్ మాల్ అయ్యాయని గుర్తించిన బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు హైదరాబాదులోని 9 ప్రాంతాల్లో ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. కీలక వ్యక్తిగా భావిస్తున్న దామోదర్ మురుగన్ తో పాటు 9 మంది అనుమానితుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డుకు చెందిన రూ.30 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయి. ఘట్ కేసర్, మెహదీపట్నం ఎస్ బీహెచ్ బ్రాంచ్ ల నుంచి నిధులు మళ్లాయని తెలిసింది.

  • Loading...

More Telugu News