: కర్ణాటక స్థానిక ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు!


కన్నడనాట జిల్లా, తాలూకా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 12, 20 తేదీల్లో ఎన్నికలు జరుగగా, మొత్తం 1,083 జిల్లా పంచాయతీలు, 3,884 తాలూకాలకు ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 659 జిల్లా పంచాయతీ సీట్లలో విజేతలను ప్రకటించగా, కాంగ్రెస్ 303, బీజేపీ 275, జనతాదళ్ (సెక్యులర్) 59, స్వతంత్రులు 29 గెలుచుకున్నారు. ఇక తాలూకా పంచాయతీల విషయానికి వస్తే, 2,366 స్థానాల్లో ఫలితాలు వెలువడగా, కాంగ్రెస్ 1,041, బీజేపీ 874, జనతాదళ్ (సెక్యులర్) 322, బీఎస్పీ 4, సీపీఎం 6, జనతాదళ్ (యు) 7, స్వతంత్రులు 107, ఇతర పార్టీల వారు 5 స్థానాలను గెలుచుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పూర్తి ఫలితాలు వెలువడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News