: చాలా మంది టచ్ లో వున్నారు... టీడీపీలోకి మరింత మంది వస్తారు: కళా వెంకట్రావు
తెలుగుదేశం పార్టీతో పలువురు నేతలు టచ్ లో ఉన్నారని, మరింత మంది పార్టీలోకి వస్తారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి, మంచివారు వస్తే కనుక తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. జగన్ అరాచకవాదని, పట్టిసీమను వ్యతిరేకించడంపై వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ఆదినారాయణరెడ్డే స్వయంగా చెప్పారని అన్నారు. ఇక, ఏపీలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయని, రెండు సంవత్సరాల్లో 20 ఎమ్మెల్సీ స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. పార్టీలోకి వచ్చే నేతలకు అవసరమైతే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని ఓ తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ ఆయన వివరించారు.