: ఢిల్లీ గడప తొక్కిన ‘రోహిత్ వేముల’ నిరసనలు... సంఘీభావం తెలపనున్న రాహుల్


హైదరాబాదు సెంట్రల్ వర్సిటీ రీసెర్చీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో రంగప్రవేశం చేసిన విద్యార్థుల ఆందోళనలు నేడు ఢిల్లీ గడపను తొక్కనున్నాయి. వర్సిటీ అధికారులు, అగ్రకుల విద్యార్థుల వేధింపుల కారణంగానే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి రోజుల తరబడి ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నిన్నటిదాకా వర్సిటీలోనే కొనసాగిన ఈ ఆందోళనలు తాజాగా ఢిల్లీకి చేరాయి. మరికాసేపట్లో ఢిల్లీలోని అంబేద్కర్ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు జేఏసీ ర్యాలీ తీయనుంది. వర్సిటీల్లో విద్యార్థులపై వేధింపులకు చెక్ పెట్టేలా ‘రోహిత్ యాక్ట్’ పేరిట చట్టాన్ని తీసుకురావాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాలుపంచుకోనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News