: న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా టెస్టులో వివాదం... థర్డ్ అంపైర్ ను అనకూడని మాటన్న హాజిల్ వుడ్


ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజున వివాదం చెలరేగింది. ఆస్ట్రేలియా బౌలర్ హాజిల్ వుడ్ థర్డ్ అంపైర్ ను అనరాని మాటన్నాడు. క్రైస్ట్ చర్చ్ లో జరుగుతున్న పోరులో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హాజిల్ వుడ్, ఓ యార్కర్ ను వేయగా అది కేన్ విలియమ్సన్ ప్యాడ్స్ ను తాకుతూ వెళ్లింది. దాంతో బౌలర్ ఎల్బీ డబ్ల్యూకి అపీల్ చేశాడు. అయితే, మైదానంలోని అంపైర్ రణమోర్ మార్టినెజ్ నాటౌట్ గా ప్రకటించగా, కెప్టెన్ స్మిత్ రివ్యూను కోరాడు. బంతిని పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ రిచర్డ్ లిల్లింగ్ వర్త్ అది నాటౌట్ గానే నిర్ణయించడంతో హాజిల్ వుడ్ లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో మార్టినెజ్ వద్దకు వెళ్లిన హాజిల్ వాదన వేసుకున్నాడు. అంతేకాదు.. "హూ ద ఫ.. ఈజ్ ది థర్డ్ అంపైర్" అన్నాడు. హాజిల్ మాటలు రికార్డయ్యాయి. ఆ సమయంలో కామెంటేటర్లుగా ఉన్న వారు, హాజిల్ మాటలను తప్పుబట్టారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ హాజిల్ వుడ్, స్మిత్ లపై విచారణకు ఆదేశించారు.

  • Loading...

More Telugu News