: నాపై దుష్ప్రచారం... వైసీపీని వీడటం లేదు: మీడియా కథనాలపై బొబ్బలి రాజు ఫైర్


బొబ్బిలి రాజు, వైసీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు కొద్దిసేపటి క్రితం మీడియా కథనాలపై అంతెత్తున ఎగిరిపడ్డారు. వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నట్లు ప్రసారమవుతున్న కథనాలపై ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. తాను వైసీపీని వీడటం లేదని సుజయకృష్ణ రంగారావు స్పష్టం చేశారు. తనపై కొంత మంది ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యేగా ఉన్న రంగారావు వైసీపీని వీడుతున్నట్లు రెండు రోజులుగా మీడియాలో వరుస కథనాలు ప్రసారమవుతున్నాయి. నిన్న భూమా అండ్ బ్యాచ్ టీడీపీలో చేరిన నేపథ్యంలో ఈ కథనాల సంఖ్య మరింత పెరిగింది. దీంతో నేడు ఆయన మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి (వైసీపీ) కూడా రంగారావు మాదిరే మీడియా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News