: ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి... ఈనాటి ఆకు రౌడీల వార్నింగా?: రాంగోపాల్ వర్మ


తాను నిర్మిస్తున్న 'వంగవీటి' సినిమా కోసం 'కమ్మ, కాపు...' పాట రాసిన సిరాశ్రీని బెదిరించిన వాళ్లకు ఇదే తన చివరి హెచ్చరికంటూ రాంగోపాల్ వర్మ పెట్టిన ట్వీట్లు సంచలనం కలిగిస్తున్నాయి. "విజయవాడ రావడానికి వార్నింగ్ ఇస్తున్న వాళ్లకి నా కౌంటర్ వార్నింగ్. నేనిప్పుడొస్తా. ఎక్కడుంటానో చెబుతా. మీకు దమ్ముంటే ముంబైలో అడుగు పెట్టండి" అంటూ గత రాత్రి 9 గంటల ప్రాంతంలో ట్వీట్లు మొదలు పెట్టిన వర్మ పలు హెచ్చరికలు చేశాడు. "నాకు వార్నింగ్ ఇస్తున్న రౌడీలనుకునే ఆకురౌడీలు బావిలో కప్పలు. విజయవాడను నేను ఆ రౌడీలమనుకునే రౌడీలకన్నా ఎక్కువ గౌరవిస్తా" అని, 26న ఉదయం ఎయిర్ కోస్టా విమానంలో 11:25కు విజయవాడలో దిగుతానని చెబుతూ, పీఎన్ఆర్ నంబర్ ను ట్వీట్ చేశాడు. ఆపై, "రౌడీగార్లూ... నేను బందర్ రోడ్డులోని ఫోర్చ్యూన్ హోటల్ లో దిగుతున్నా... పాత ఖాందారీ హోటల్" అని, "ఆనాటి గొప్ప రౌడీలతో తిరిగిన నాలాంటి రౌడీకి వార్నింగ్ ఇస్తున్న రౌడీలమనుకునే ఈనాటి ఆకు రౌడీలకి నేనిచ్చే వార్నింగ్..." అంటూ రాత్రి 11:30 వరకూ వరుస ట్వీట్లు పెట్టాడు.

  • Loading...

More Telugu News