: ముందస్తు బుకింగ్ చేసుకున్న వాళ్లకు డబ్బులు చెల్లిస్తాం: రైల్వే అధికారులు
విద్య, ఉద్యోగావకాశాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్ కులస్తులు హర్యానాలో చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. రద్దయిన రైళ్లకు సంబంధించి ముందస్తు బుకింగ్ చేసుకున్న టిక్కెట్లన్నింటికీ పూర్తి డబ్బులు తిరిగి చెల్లిస్తామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నేరుగా రిఫండ్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని చెప్పారు. రైల్వే రిజర్వేషన్ కేంద్రాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఆ కేంద్రాల నుంచే డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని అధికారులు చెప్పారు.