: రాజకీయ పార్టీ కార్యాలయం ముసుగులో వ్యభిచారం!


కార్యాలయం ముందు పార్టీ బోర్డు... లోపల నిర్వహించేది వ్యభిచారం. ఈ దారుణ సంఘటన తమిళనాడులోని తిరుపూర్ మంగళం రోడ్డులో జరిగింది. ఈ రోడ్డులో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం ఉంది. ఈ పార్టీకి సంబంధించి అసంఘటిత కార్మిక సంక్షేమ సంఘం నిర్వాహకుడిగా సెంథిల్ కుమార్ పనిచేస్తున్నాడు. ఈ కార్యాలయంలో వ్యభిచారం జరుగుతున్నట్లు తిరుపూరు మహిళా పోలీసులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగారు. ఈ కార్యాలయం వద్ద నిఘా పెట్టడంతో కార్యాలయం లోపలి గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం బయటపడింది. కార్యాలయం మొదటి అంతస్తులో మహిళలు ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆరుగురు యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని, ఒక బాలికను బలవంతంగా ఈ రొంపిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఆరుగురు మహిళలు సహా 14 మందిని అరెస్టు చేశామని.. కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కాగా, బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించారు.

  • Loading...

More Telugu News