: భూమాతో దౌత్యం నెరపిన బాలకృష్ణ!


భూమా నాగిరెడ్డి టీడీపీ తీర్థం తీసుకునే విషయంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రముఖ పాత్ర పోషించారని సమాచారం. గతంలో జరిగిన పలు వ్యవహారాలతో విసిగిపోయిన భూమా నాగిరెడ్డి కొంత కాలంగా జగన్ పై, పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలుసార్లు ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. గతంలో కర్నూల్ జిల్లాలో జరిగిన కోఆపరేటివ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎదురైన చేదు అనుభవం విషయంలో భూమాను జగన్ తప్పుపట్టారు. దీంతో, విరక్తి చెందిన భూమా ఆ పార్టీ నుంచి బయటపడాలని నాడు నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితుల సమాచారం. ఈ నేపథ్యంలో భూమాను టీడీపీలోకి లాగేందుకు మంతనాలు జరిగాయి. ఈ క్రమంలో టీడీపీ నేతలు బాలకృష్ణ, లోకేష్ లు భూమాతో సత్సంబంధాలు నెరిపి ఆయన టీడీపీ తీర్థం తీసుకునేలా చేశారని సమాచారం. కాగా, భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారంటూ ప్రతిసారీ, వార్తలు రావడం... వాటిని ఖండించడం జరిగింది. అయితే, ఈసారి మాత్రం ఆ వార్తలను ఖండించకపోగా, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పిన భూమా నాగిరెడ్డి ఎట్టకేలకు టీడీపీలో చేరారు.

  • Loading...

More Telugu News