: ఢిల్లీలో జగన్... బెజవాడలో ఝలక్!
వైఎస్సార్సీపీ నేతలు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కోసం ఎదురు చూస్తున్నవేళ...వారిని ఆపేందుకు ఆ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడకపోవడం విశేషం. ఇంత కీలకమైన సమయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ఉండడం ఇంకా విశేషం. రెండు రోజుల పర్యటన కోసం నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన, ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. భూమా నాగిరెడ్డితో నిన్న ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు చర్చలు జరిపినప్పటికీ అవి విఫలం కావడం విశేషం. దీంతో వారు పార్టీ మారడం ఆగేది కాదని భావించిన జగన్, హైదరాబాదులో ఉంటే వీటన్నింటి కోసం స్పందించాల్సి వస్తుందని భావించారు. దీంతో అలాంటి ఇబ్బంది తలెత్తకుండా, తన కేసులపై వరుసగా దర్యాప్తు సంస్థలు స్పందిస్తున్న క్రమంలో ప్రధానితో అపాయింట్ మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.