: నాలో నటిని గుర్తించిన తొలి వ్యక్తి రణ్ వీర్ సింగ్: పరిణీతి
తనలోని నటిని గుర్తించిన తొలి వ్యక్తి రణ్ వీర్ సింగ్ అని బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తెలిపింది. ముంబైలో జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తొలిసారి 'షీలాకీ జవానీ' పాటకు డాన్స్ చేస్తున్నప్పుడు రణ్ వీర్ సింగ్ చూశాడని, అప్పుడే తనలో ఓ మంచి నటి దాగుందని గుర్తించాడని పరిణీతి తెలిపింది. ఆ తర్వాతే తన తొలి సినిమా 'లేడీస్ వర్సెస్ రిక్కీ బెహెల్'లో నటించానని ఆమె చెప్పింది. కాగా, ఆ సినిమాలో రణ్ వీర్ సింగ్ కు జతగా పరిణీతి నటించిన సంగతి తెలిసిందే.