: అన్ని జిల్లాల నుంచి వలసలు ఉంటాయి: గంటా
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వలసలు ఉంటాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో చేరేందుకు ఇతర పార్టీల కార్యకర్తలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పడుతున్న తపనను చూసిన వివిధ పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరేందుకు సంసిద్ధులవుతున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసం చూరగొనడంలో విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కార్యకర్తలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు.