: ఒబామాతో డ్యాన్స్ చేసిన బామ్మగారు!


వైట్ హౌస్ లో ఆఫ్రికన్-అమెరికన్ ని అధ్యక్షుడిగా చూడాలన్న తన చిరకాల కోరిక నెరవేరడంతో 106 ఏళ్ల వయస్సున్న వర్జీనియా మెక్ లారెన్ అనే బామ్మ సంతోషం పట్టలేకపోయింది. ఒబామాను చూడగానే ‘హాయ్’ అంటూ పలకరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అందుకు ఒబామా ప్రతిస్పందిస్తూ, ఆమె రెండు చేతులను పట్టుకుని ‘హౌఆర్ యూ’ అని ప్రశ్నించగా ‘ఐయామ్ ఫైన్’ అని ఆమె సమాధానమిచ్చింది. ఒబామాను కలిసిన ఆనందంలో ఆమె డ్యాన్స్ చేసింది. ‘మిషెలీ ఒబామా కు హాయ్ చెప్పాలని అనుకుంటున్నారా?’ అని ఒబామా లారెన్ ను అడగటం.. వెంటనే ఆమె చేతులూపుతూ ఫస్ట్ లేడీని విష్ చేయడం జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను వైట్ హౌస్ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, 2014లోనే ఒబామాను కలవాలని లారెన్ అనుకున్నప్పటికీ వైట్ హౌస్ అధికారుల అనుమతి లభించలేదు.

  • Loading...

More Telugu News