: నాకే కాదు, ప్రధానికి కూడా కోర్టు సమన్లు వస్తుంటాయి: సుజనా చౌదరి
కోర్టు సమన్లు తనకే కాదు.. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా వస్తుంటాయిని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనా కంపెనీలు తిరిగి చెల్లించకపోవడం.. కోర్టు సమన్లు జారీ అయిన విషయమై ఆయన్ని విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. సుజనా కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలనే ప్రశ్నించాలని అన్నారు. ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు, విభజన చట్టంలోని హామీల అమలు గురించి కూడా మంత్రి మాట్లాడారు. ప్రస్తుత రైల్వే బడ్జెట్ లో విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించే అవకాశముందని సుజనాచౌదరి చెప్పారు.