: ఏపీకి ఇప్పటికే ఎంతో సాయం చేశాం: పురందేశ్వరి


విభజన అనంతరం ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సాయం చేసిందని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఒంగోలులో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇకపై కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందని అన్నారు. వచ్చే నెల 6న రాజమండ్రిలో జరిగే సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొంటారని వెల్లడించిన ఆమె, విశాఖకు రైల్వే జోన్ ను తీసుకువచ్చే అంశంలో ప్రతిపాదనలు ఉన్నాయని, మరోసారి కేంద్రానికి విన్నవిస్తామని తెలిపారు. ఇదే సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ, వెనుకబడిన తరగతుల వారికి నష్టం కలుగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే, తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News