: ఇక గేట్లు తెరవండి... 8 మంది వైకాపా ఎమ్మెల్యేల చేరికకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరింది. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్న 8 మంది వైకాపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీలోకి వస్తామని చెబుతున్న వారికి గేట్లు తెరవాలని, వారితో చర్చించాలని కొంతమంది మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులను తన చాంబర్ కు పిలిపించుకుని చర్చించినట్టు సమాచారం. తాను పార్టీ ఆఫీసుకు నిత్యమూ వస్తానని, ఈ ఉదయం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వెల్లడించగా, నేతలు, మంత్రులు రిలీఫ్ గా ఫీలైనట్టు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు ఇకపై ఉండరాదని, పార్టీలో అసంతృప్తులకు అడ్డుకట్ట వేయాలని బాబు సూచించినట్టు సమావేశంలో పాల్గొన్న నేత ఒకరు తెలిపారు.