: స్వామివారి దయ కోసం భక్తుల లేఖలు!
గుజరాత్ లోని జగన్నాథ స్వామి వారి దయ కోసం భక్తులు లేఖలు రాస్తున్నారు. అహ్మదాబాద్ లోని ప్రఖ్యాతి గాంచిన ఈ ఆలయం సుమారు 450 ఏళ్ల నాటిది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరాలంటూ రాసిన లేఖలను డొనేషన్ బాక్స్ లో వేస్తున్నారని ఆలయ అధికారులు తెలిపారు. ఆ లేఖల్లో ఉద్యోగాలు ఇప్పించమని, తమ ప్రేమ సఫలం కావాలని కోరుకుంటూ రాసిన వాటి సంఖ్యే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆలయ ట్రస్టీ మహీంద్ర ఝా మాట్లాడుతూ, ఇటువంటి లేఖలు తరచుగా తమకు కనపడుతున్నాయని చెప్పారు. కాంపిటీటివ్ పరీక్షలు జరిగే సందర్భాలలో అయితే డొనేషన్ బాక్స్ లో పడే లేఖల సంఖ్య ఎక్కువగా ఉంటాయన్నారు. కేవలం ఆ లేఖలే కాకుండా పెళ్లి కుదిరిన వారు కూడా తమ వెడ్డింగ్ కార్డులను డొనేషన్ బాక్స్ లో వేస్తారని ఝా పేర్కొన్నారు.