: ఫిర్యాదుపై అధికారులు స్పందించలేదంటూ మహిళ ఆత్మహత్యాయత్నం
గ్రీవెన్స్ డే లో తాను చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆవేదన చెందిన ఒక మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గుంటూరులో జరిగింది. గ్రీవెన్స్ డే లో ఫిర్యాదు చేసేందుకని మల్లవరానికి చెందిన విజయమ్మ అనే మహిళ జిల్లా పరిషత్ కార్యాలయానికి వచ్చింది. మల్లవరంలో క్వారీ కోసం కొండలు పగలకొడుతున్నారని, దీంతో గత నలభై ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న తాము ఆశ్రయం కోల్పోవాల్సి వస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే, తన ఫిర్యాదుపై అధికారులు స్పందించలేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన జిల్లా పరిషత్ సిబ్బంది ఆమెను జీజీహెచ్ కు తరలించారు.