: కలెక్టర్లతో భేటీకి వేళాయే!... నేడు, రేపు జిల్లాల కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం


ఓ వైపు పార్టీ కార్యకలాపాలు, మరోవైపు నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణాలపై నిత్యం బిజీబిజీగా గడుపుతున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... నేడు, రేపు మరింత ఊపిరిసలపని రీతిలో సుదీర్ఘ సమావేశాల్లో నిమగ్నం కానున్నారు. మరికాసేపట్లో విజయవాడ కేంద్రంగా ప్రారంభం కానున్న జిల్లాల కలెక్టర్ల సమావేశం నేడు, రేపు... రెండు రోజుల పాటు జరగనుంది. బడ్జెట్ రూపకల్పన, గతేడాది సాధించిన ప్రగతి, ఎదురైన సమస్యలు. నమోదైన వృద్ధి తదితర నివేదికలను సిద్ధం చేసుకున్న చంద్రబాబు... సమావేశాల ఎజెండాను ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. రానున్న ఏడాదిలో ప్రభుత్వ ప్రాథామ్యాలపై చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పలు శాఖల ఉన్నతాధికారులు, కొన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరునూ ఆయన ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. పాలనలో అలసత్వం, అవినీతి వ్యవహారాలపై ఆయన అధికారులకు కాస్తంత ఘాటు హెచ్చరికలే చేయనున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News