: చిత్ర బృందానికి కేక్ లు, బిర్యానీ వడ్డించిన బాలీవుడ్ హీరో
హిందీ సినిమా బాఘీ చిత్ర బృందం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన కప్ కేకులు, బిర్యానీని ఆ చిత్రం హీరో టైగర్ ఫ్రాఫ్ ఈరోజు తెప్పించారు. ఈ విషయాన్ని బాఘీ చిత్రంలో టైగర్ ష్రాఫ్ సరసన నటిస్తున్న శ్రద్ధాకపూర్ తన ట్వీట్ లో పేర్కొంది. కప్ కేకుల ఫొటో ఒకటి పోస్ట్ చేసింది. ఈ కేకులపై బాఘీ లోగో ఉండటం వాటి ప్రత్యేకత. కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1990లో విడుదలైన బాఘీ- ఎ రెబెల్ ఫర్ లవ్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాను దర్శకుడు షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తున్నారు.