: సమాచార శాఖ మరింత బలోపేతం కావాలి: మంత్రి హరీశ్ రావు
ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే సమాచార శాఖ పనిచేస్తోందని, కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రజా సంబంధాల శాఖాధికారులతో ఈ రోజు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, వాటిపై ప్రజల స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకునే విషయంలో అధికారులు ముందుండాలని, ప్రభుత్వానికి- ప్రజలకు వారధిగా ఉండే సమాచార శాఖను మరింత బలోపేతం చేయడానికి వారు పాటుపడాలని హరీశ్ రావు అన్నారు.