: చంద్రబాబును మానసిక వైద్యుడికి చూపించాలి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
మురికివాడల ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మానసిక వైద్యుడికి చూపించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మురికివాడల ప్రజలు ఓట్లు వేస్తేనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడేమో, వారిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. అగ్రకుల అహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, గతంలో దళితులను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యానించారని..సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం మంచిపద్ధతి కాదని కల్పన అన్నారు.