: మా క్యాంటీన్ లోది గేదె మాంసం బిర్యానీ: ఏఎంయూ వీసీ


గేదె మాంసంతో తయారు చేసిన బిర్యానినే తమ క్యాంటీన్ లో వడ్డించారని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ(ఏఎంయూ) వీసీ జమీర్ ఉద్దీన్ షా వివరణ ఇచ్చారు. ఈ యూనివర్శిటీలోని మెడికల్ కాలేజీ క్యాంటీన్ లో ఆవు మాంసంతో తయారు చేసిన బిర్యానినీ వడ్డిస్తున్నారంటూ వాట్సప్ లో ఫొటోలు పెట్టడం తెలిసిందే. ఈ వ్యవహారంపై దుమారం రేగిన నేపథ్యంలోనే వీసి వివరణ ఇచ్చారు. ఆవు మాంసం బిర్యానీ వడ్డించామన్నది అవాస్తవమని, మతసహనాన్ని దెబ్బతీసేందుకే ఈ తరహా పోస్టింగులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయన్నారు. క్యాంటీన్ లో చేపట్టిన తనిఖీలతో స్థానిక బీజేపీ ఎంపీ సంతృప్తి చెందారని ఆయన చెప్పారు. కాగా, యూనివర్శిటీ క్యాంటీన్ కాంట్రాక్టర్ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అలీగఢ్ మేయర్ (బీజేపీ), పార్టీ నేతలు నిన్న సమాజ్ వాదీ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News