: ‘హోదా’కు కేంద్రం సానుకూలమే... ఆ నలుగురు సీఎంలే అడ్డంకి: అశోక్ గజపతిరాజు


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగానే ఉందని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. అయితే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సిద్దరామయ్య, నవీన్ పట్నాయక్, జయలలితలు అభ్యంతరం చెబుతున్నారని ఆయన కొద్దిసేపటి క్రితం శ్రీకాకుళంలో వ్యాఖ్యానించారు. ఈ నలుగురు సీఎంల అభ్యంతరాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News