: ఇక గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల వంతు!... మార్చి 6న ఎన్నికలు, 9న కౌంటింగ్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ సర్కారు... గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగర పాలక సంస్థల్లో ఎన్నికల నగారా మోగించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం... రేపటి నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల దాఖలు ఈ నెల 24న ముగియనుంది. ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, 26 సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించింది. వచ్చే నెల (మార్చి) 6న రెండు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనుండగా, అదే నెల 9న కౌంటింగ్ జరగనుంది.