: బెంగళూరులో బాలయ్య... లేపాక్షి ఉత్సవాల రోడ్ షోకు హాజరు


టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టున్నారు. తన సొంత నియోజకవర్గంలో త్వరలో జరగనున్న లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేసే పనిని భుజాన వేసుకున్న ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే హైదరాబాదులోని పలువురు ప్రముఖులను కలిసి లేపాక్షి ఉత్సవాల ఆహ్వానాలు అందజేసిన ఆయన ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేశారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆయన ఉత్సవాలకు ఆహ్వానించారు. తాజాగా నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లిన బాలయ్య, అక్కడ జరిగిన లేపాక్షి రోడ్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. లేపాక్షి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించడంతో పాటు ఉత్సవాల పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక బెలూన్లను కూడా ఆయన ఎగురవేశారు.

  • Loading...

More Telugu News