: ఆటోను చూసి ముచ్చటపడ్డ అభిషేక్ బచ్చన్


బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ ఆటోను చూసి ముచ్చటపడ్డాడు. అంతేకాదు, ఆ ఆటోలో కూర్చుని ఫోటో దిగి దానిని ట్విట్టర్ లో కూడా పెట్టాడు. ఆ వివరాల్లోకి వెళితే, ప్రో కబడ్డీ లీగ్ లో జైపూర్ పాంథర్స్ జట్టుకి అభిషేక్ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఆ కబడ్డీ జట్టుకి ఓ ఆటోవాలా వీరాభిమానిగా మారాడు. అంతేకాదు, తన ఆటోను జైపూర్ పాంథర్స్ లోగోలతో ఆ అభిమాని నింపేశాడు. ఆ ఆటో అభిషేక్ కంటపడింది. అతని అభిమానానికి ముగ్ధుడైన అభిషేక్ ఆటో డ్రైవర్ సీట్లో కూర్చుని ఫోటో తీసుకుని దానిని ట్విట్టర్లో పెట్టాడు.

  • Loading...

More Telugu News