: నాకిది కొత్త సినిమా అయిపోయింది: నారా రోహిత్
వైవిధ్యమైన కధలు ఎంచుకుంటూ రావడంతో ఇది తనకు కొత్త సినిమా అయిపోయిందని నారా రోహిత్ తెలిపాడు. హైదరాబాదులో నిన్న రాత్రి నిర్వహించిన 'తుంటరి' ఆడియో వేడుకలో రోహిత్ మాట్లాడుతూ, ఈ జానర్ లో తానింత వరకు నటించలేదని, దీంతో ఈ అనుభవం కొత్తగా ఉందని అన్నాడు. తన సినిమా అనగానే ప్రేక్షకులు వైవిధ్యాన్ని కోరుకుంటారని, ఈసారి ఇది మరింత కొత్తగా ఉంటుందని చెప్పాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డామని చెప్పిన రోహిత్, సినిమా చాలా బాగా వచ్చిందని అన్నాడు. విలన్ గా కబీర్ బాగా నటించాడని, సహనటులు చక్కని సహకారం అందించారని రోహిత్ పేర్కొన్నాడు. తన గత సినిమాల్లోలాగే ఈ సినిమాకు కూడా సాయి కార్తీక్ మంచి ఆడియో అందించాడని రోహిత్ తెలిపాడు.