: హైదరాబాదును ప్రణాళికాబద్ధంగా అభివృద్ది చేస్తాం: కేటీఆర్
హైదరాబాదును ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడతామని అన్నారు. ఇందుకోసం ముందుగా దేశంలోని ప్రధాన పట్టణాల్లో కల్పించిన వసతులపై సమగ్ర అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం హైదరాబాదులో చేపట్టాల్సిన విధానంపై ఒక అవగాహనతో పని చేస్తామని ఆయన తెలిపారు. కాగా, త్వరలో పలు నగరాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నామని ఆయన వెల్లడించారు.