: సోనియా, రాహుల్ లకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు


నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మరో ముగ్గురికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పటియాలా హౌస్ కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వ్యక్తిగత హాజరుపై ఉత్తర్వులు జారీ చేశామని న్యాయస్థానం పేర్కొంది. దీంతో శ్యాంపిట్రోడాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. అనంతరం ఈ కేసు విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News