: కృష్ణా జిల్లాలో విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థిపై కొందరు దుండగులు దాడి చేశారు. డబ్బులు చెల్లించే విషయంలో విద్యార్థి, దుండగుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో దుండగులు బాలుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఇంతలో అక్కడి స్థానికులు బాలుడిని చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. దుండగులు పరారీలో ఉన్నారు.