: భూమాను బుజ్జగిస్తున్న విజయసాయిరెడ్డి, సజ్జల
కర్నులూ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డితో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ నిన్నటి (శుక్రవారం) నుంచి ప్రచారం జరుగుతుండటంతో ఆ పార్టీ బుజ్జగింపు చర్యలకు దిగింది. ఈ మేరకు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భూమాతో మాట్లాడుతున్నారు. టీడీపీలోకి ఎందుకు వెళుతున్నారు? వారికున్న సమస్యలేంటి? వంటి పలు విషయాలపై మాట్లాడుతున్నట్టు సమాచారం. మరోవైపు జగన్ కూడా కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై ఇదే విషయంపై చర్చిస్తున్నారు.