: తగ్గనున్న అత్యవసర ఔషధాల ధరలు


వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాల ఔషధాలు వాడుతున్న ప్రజలందరికీ శుభవార్త. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అత్యవసర ఔషధాల ధరలు 3 శాతం వరకూ తగ్గనున్నాయి. పెయిన్ కిల్లర్స్, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకునే మందులు, షుగర్, గుండెపోటు తదితరాలకు వాడే ఔషధాలు, యాంటీ బయాటిక్స్ ధరలు తగ్గుతాయి. మొత్తం 750కి పైగా వివిధ రకాల ఫార్ములేషన్స్ వాడుతూ తయారవుతున్న ఔషధాలకు, 2013లో తీసుకువచ్చిన కొత్త ఫార్మాస్యుటికల్ పాలసీలో భాగంగా ఈ వెసులుబాటు లభించనుంది. ఎట్టి పరిస్థితుల్లోను ధరలను తగ్గించి తీరాలని ఔషధ కంపెనీలకు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News