: అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. హైదరాబాదులోని పార్టీ ప్రధాన కార్యాలయం లోటస్ పాండ్ లో ఈ భేటీ జరుగుతోంది. కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు, జోగు రమేశ్, ఆదిరెడ్డి అప్పారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ తెలుగుదేశంలోకి వెళుతుండటం, కొందరు బీసీ నేతలు కూడా వెళ్లే అవకాశం ఉందన్న నేపథ్యంలో వీరు సమావేశమైనట్టు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి.