: బ్యాంకు పరీక్షల షెడ్యూల్ విడుదల... తేదీలివే!
2016 సంవత్సరానికి గాను వివిధ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకాలకు సంబంధించి ఐబీపీఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అఫీషియల్ నోటిఫికేషన్ జూలైలో ప్రకటిస్తామని, అక్టోబర్ 16, 22, 23 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు జరుగుతాయని ఐబీపీఎస్ వెల్లడించింది. మెయిన్ పరీక్ష నవంబర్ 20న జరుగుతుందని ప్రకటించింది. మరింత సమాచారం, అప్ డేట్స్ కోసం 'http://www.ibps.in' వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.