: టెస్ట్ చరిత్రలో మెక్ 'కల్లోలం'... వివ్ రిచర్డ్స్, మిస్బాల రికార్డు బద్దలు
టెస్ట్ క్రికెట్ చరిత్రలో మరో రికార్డు బద్దలైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజు న్యూజిలాండ్ కెప్టెన్ మెకల్లమ్ విజృంభణతో వివ్ రిచర్డ్స్, మిస్బా-ఉల్ హక్ ల రికార్డు బద్దలైంది. కేవలం 54 బంతుల్లో మెక్ సెంచరీని సాధించాడు. 16 ఫోర్లు, నాలుగు సిక్స్ ల సాయంతో 12వ టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న ఆయన గతంలో 56 బంతుల్లో ఉన్న రికార్డును తిరగరాశాడు. 39 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించగా, ఆపై మెక్ ను ఏ బౌలరూ అడ్డుకోలేకపోయాడు. ఇదే ఇన్నింగ్స్ లో 100 సిక్స్ లు కొట్టిన ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రికార్డును కూడా మెక్ సమం చేశాడు.