: ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డికి అస్వస్థత
ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.