: విజయవాడ కన్నా సింగపూర్ నయం: ముఖ్యమంత్రి చంద్రబాబు


విజయవాడలో ఇంటి అద్దెలని విపరీతంగా పెంచేస్తున్నారని, అధికారులు ఇక్కడికి రావాలంటే భయపడిపోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బెజవాడలో కన్నా సింగపూర్ లో వ్యాపారాలు చేయడం చాలా తేలికని, అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువగా రేట్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల విలువ పెరిగిందని చెప్పి వాటిని అమ్మడం మానేశారని, వాటి ధరలు కూడా పెంచేశారని, ఇంటి అద్దెలను యజమానులు పెంచేశారని అన్నారు. భూమి మీద, ఇంటి అద్దెల మీద డబ్బు సంపాదించాలంటే చాలా సమస్య వస్తుందని, వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలనుకుంటే ఎటువంటి సమస్య ఉండదని, అలాంటి ఆలోచనా విధానాన్ని ప్రజలు, గృహ యజమానులు అలవరచుకోవాలని ఆయన సూచించారు. అందుకే, విజయవాడకు పెద్ద ఇండస్ట్రీస్ రాలేదని, ఇక్కడి వ్యక్తులు మాత్రం ప్రపంచమంతటా సంస్థలు పెట్టారని ఈ విషయాన్ని గమనించాలని చంద్రబాబు కోరారు.

  • Loading...

More Telugu News