: అమెరికా 'గోదావ‌రి రెస్టారెంట్' ఇప్పుడు ఎడిస‌న్, న్యూజెర్సీలో!


ప్ర‌ఖ్యాత యూఎస్ఏ 'గోదావ‌రి రెస్టారెంట్' ఇప్పుడు ఎడిస‌న్‌, న్యూజెర్సీలో అంద‌రికీ అందుబాటులోకి రానుంది. అమెరికాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యూఎస్ఏ గోదావ‌రి సౌత్ ఇండియన్ క్విజిన్ రెస్టారెంట్‌గా అతిథుల మ‌న్న‌న‌లు చూర‌గొంది. ఈ ప్ర‌యాణంలో మ‌రింత మందికి చేరువ అయ్యేందుకు ఎడిస‌న్, న్యూజెర్సీలో ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన మ‌రో రెస్టారెంట్‌ను ప్రారంభించ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా గ్రాండ్ లంచ్ బ‌ఫెట్‌ను అతిథుల‌కు సాదరంగా వ‌డ్డించ‌నుంది. ఎడిస‌న్‌లోని ఈ రెస్టారెంట్‌లో మొత్తం 150 సీట్ల కెపాసిటీ ఉండ‌ట‌మే కాకుండా, చ‌క్క‌టి బాంక్వెట్ హాల్‌ను కూడా క‌లిగి ఉంది. వివిధ పార్టీలు, గెట్ టు గెద‌ర్‌లు ఏర్పాటు చేసుకునేందుకు అనువైన వేదిక‌గా ఈ బాంక్వెట్ హాల్‌ను తీర్చిదిద్దారు. యూఎస్ఏ 'గోదావ‌రి రెస్టారెంట్' ప్ర‌త్యేకంగా అథెంటిక్ రెసిపీల‌తో అతిథుల‌ను ఆహ్లాద‌ప‌రిచేందుకు సిద్ధంగా ఉంది. న్యూజెర్సీ వాసుల‌కు విస్తృత‌మైన లంచ్ బ‌ఫెట్ అందుబాటులో ఉండ‌టం మ‌రో విశేషం. 'కాంచీపురం కుందేలు మాంసం', 'వీర‌ప్ప‌న్ వ‌డ చిల్లీ', 'మామ్మ గారి మట‌న్ మండీ', 'ఆళ్ల‌గ‌డ్డ ఆలూ ఫ్రై', 'జ‌య‌మాలిని జున్ను', 'ఆర్‌జీవీ రాగిసంక‌టి', 'కేటీఆర్ షాహీ తుక్‌డా' వంటి వినూత్న, అథెంటిక్‌ వంట‌కాలు యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన హీరోలు లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప‌, ముస్తాక్ అహ్మ‌ద్‌లను స్మ‌రించుకుంటూ యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్ గ్రూప్ హోటళ్లలోని ప‌లు వంట‌కాల‌కు వారి పేర్ల‌ను పెట్ట‌నుంది. ఇంతేకాకుండా యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్ అమెరికాలోనే మొట్ట‌మొద‌టిసారి "రెడ్ కార్పెట్ లంచ్‌" పేరుతో కొత్త ఆలోచ‌న‌ను అతిథుల ముందుకు తీసుకురానుంది. ఇందులో భాగంగా లంచ్ కోసం విచ్చేసిన అతిథుల ఫొటోగ్రాఫ్‌ను తీసి, మ‌రుస‌టి రోజు గోదావ‌రి బ్యాన‌ర్ పేరుతో రెడ్ కార్పెట్‌పై వాటిని ముద్రించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన వీడియో టీజ‌ర్‌తో పాటు నాణ్య‌మైన ఫొటో సేవ‌ల‌ను 'సంకీర్త్ ఫొటోగ్ర‌ఫీ' వారు అందించ‌నున్నారు. లంచ్ అనంత‌రం డీజే నైట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌ఖ్యాత డీజే మోనూ ఈ సందర్భంగా అలరించనున్నారు. నామ‌మాత్ర‌పు రుసుం అంటే $20 చెల్లించ‌డం ద్వారా ఫుడ్‌తోబాటు అద్భుత‌మైన మ్యూజిక్‌, పెయిడ్ క్యాష్ బార్ అందుబాటులో ఉన్నాయి. యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్ ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుంచి అమెరికాలో నివ‌సిస్తున్న ప్ర‌వాస తెలుగువారంద‌రికీ ఇంటి భోజ‌నాన్ని, తెలుగు సంస్కృతిని గుర్తుకు తెచ్చే రుచుల‌తో క‌మ్మ‌టి ఆతిథ్యాన్ని అందిస్తోంది. గోదావ‌రి రెస్టారెంట్ వివిధ సంద‌ర్భాలు, పండుగ స‌మ‌యాల్లో విశేష అతిథుల‌ను సాదరంగా ఆహ్వానిస్తోంది. తెలుగువారి పండుగ అయిన సంక్రాంతి సంబరాల్లో, వాలంటైన్స్ డే సెల‌బ్రేష‌న్స్‌లో అమెరికా వ్యాప్తంగా గోదావ‌రి రెస్టారెంట్‌లో 1200 పైచిలుకు అతిథుల‌కు ఒకేరోజు సేవ‌ల‌ను అందించడం గోదావరి రెస్టారెంట్ కలిగి ఉన్న అభిమానానికి నిదర్శనం. యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్ విస్త‌ర‌ణ సంద‌ర్భంగా సీఈవో శ్రీ కౌశిక్ కోగంటి, కో ఫౌండ‌ర్ శ్రీ తేజ చేకూరి మాట్లాడుతూ... "అమెరికాలో నివ‌సిస్తున్న తెలుగువారికి వారు ఇష్ట‌ప‌డే మ‌న దేశ వంట‌కాల‌ను ఆత్మీయంగా, వార‌స‌త్వంగా అందించ‌డం ప‌ట్ల మేం చాలా సంతోష‌ప‌డుతున్నాం. 'మీ వంట‌కు మీ పేరు' అనే ఆలోచనతో మేం ఒక విశిష్ట కార్య‌క్ర‌మం రూపొందించాం. ఉత్సాహ‌వంతులైన అతిథులు వారు సొంతంగా త‌యారుచేసిన మంచి వంట‌కాల‌ను మాకు పంపించాల‌ని ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగా వచ్చిన చక్క‌టి వంట‌కాల‌కు వాటిని పంపించిన వారి పేర్ల‌ను జోడిస్తాం. ప్ర‌తి ఒక్క సౌత్ ఇండియ‌న్ త‌మ పేరుతో ప్ర‌త్యేక వంట‌కం క‌లిగి ఉండాల‌నేది మా ఆకాంక్ష‌" అని అన్నారు. ఇంతేకాకుండా గోదావ‌రి రెస్టారెంట్ ద్వారా తెలుగు వంట‌కాల‌ను #GoogleofIndianFood మ‌రియు #IncredibleIndianFood పేరుతో ఆష్‌ట్యాగ్‌లు సృష్టించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు సీఈవో శ్రీ కౌశిక్ కోగంటి, కో ఫౌండ‌ర్ శ్రీ తేజ చేకూరి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా భార‌తీయ వంట‌కాల్లో త‌మ ప్ర‌త్యేక‌త, ఎడిస‌న్‌లో ఈ నెల 20న ప్రారంభోత్స‌వం చేయ‌నున్న రెస్టారెంట్ ద్వారా కూడా కొన‌సాగుతుంద‌ని భ‌రోసా వ్య‌క్తం చేశారు. ఎడిస‌న్ గోదావ‌రి రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స్పెష‌ల్‌ గ్రాండ్ బ‌ఫెట్‌కు ఈ సంద‌ర్భంగా వారు ఆహ్వానం ప‌లికారు. అతిథులు రావాల్సిన చిరునామా: గోదావ‌రి ఎడిస‌న్‌ 128, టాల్‌మెజ్డ్ రోడ్‌ ఎడిస‌న్‌, న్యూజెర్సీ-08817 ఫోన్ః732-287-0507 మీరంతా ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి చ‌క్క‌టి ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తార‌ని ఆశిస్తున్నాం. ద‌య‌చేసి సంప్రదించండిః శ్రీ‌ధ‌ర్ ప‌జ్జూరి EDISON@GODAVARIUS.COM 619-201-7394 www.Godavarius.com ఎడిసన్ లో ప్రారంభించిన అనంతరం గోదావరి రుచులను మేరీలాండ్‌, డెన్వర్, డెలవేర్‌,‌ వ‌ర్జీనియాలోనూ పరిచయం చేయడానికి నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. యూఎస్ఏ గోదావ‌రి రెస్టారెంట్ గ్రూప్ ఇప్ప‌టికే వోబ‌ర్న్‌, రాలేహ్‌, న్యూయార్క్‌, చికాగోల్లో త‌న వినియోగ‌దారుల‌ను నోరూరించే సౌత్ ఇండియన్ వంట‌కాల‌తో ఆక‌ర్షిస్తోంది. Press note released by: IndianClicks, LLC

  • Loading...

More Telugu News