: వారం రోజుల్లో 800 ఫోన్ కాల్స్ చేసిన ఉమర్
జేఎన్ యూ ఘటనలో విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యతో పాటు దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న పీహెచ్ డీ విద్యార్థి ఉమర్ ఖలీద్ వారం రోజుల్లో 800 ఫోన్ కాల్స్ చేసినట్లు కాల్ డేటా ప్రకారం తెలిసింది. రెండు సిమ్ లను ఉపయోగించి ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 3 నుంచి 9 మధ్య జమ్మూకాశ్మీర్ తో పాటు బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు ఈ ఫోన్ కాల్స్ చేసినట్లు కాల్ డేటా సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న ఉమర్ ఖలీద్ కోసం దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా పలు రాష్ట్రాలలో అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.